కేబుల్ టీవీ చానల్స్ తో ప్రభుత్వం గేమ్స్, దమ్ముంటే ప్రసారం చెయ్యాలని కమల్ హాసన్ చాలెంజ్ | Oneindia

2018-03-26 53

Makkal Needhi Maiam founder Kamal Haasan has said a government which is not honest enough and does not have guts to face criticism will not remain not just in history.

ప్రముఖ బహుబాష నటుడు, దర్శక నిర్మాత, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తమిళనాడు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విమర్శలు ఎదుర్కొనే సత్తా తమిళనాడు ప్రభుత్వానికి లేదని, ఆ దమ్ము లేకనే కేబుల్ టీవీ చానల్స్ తో గేమ్స్ ఆడుతోందని కమల్ హాసన్ ఆరోపించారు.
తమిళనాడు ప్రభుత్వం అరసు కేబుల్ టీవీని నడుపుతున్నది. పేద ప్రజల కోసం అతి తక్కువ ధరకు అనేక చానల్స్ ను ప్రసారం చెయ్యడానికి జయలలిత గతంలో అరసు కేబుల్ టీవీ చానల్ ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.
తమిళనాడు ప్రభుత్వం ఏది చేస్తే అది రైట్ అన్నట్లు వ్యవహరిస్తోందని కమల్ హాసన్ ఆరోపించారు. తమిళనాడు ప్రభుత్వం ప్రజలను ఉద్దరిస్తోందని ఉచిత ప్రచారం చేసుకుంటోందని కమల్ హాసన్ విమర్శించారు.
తమిళనాడు ప్రభుత్వం అవినీతి గురించి, అసమర్థత గురించి విమర్శించే ప్రతిపక్షాల వార్తలను అరుసు కేబుల్ టీవీలో ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని కమల్ హాసన్ ఆరోపించారు. మీ చేతని కాని ప్రభుత్వం గురించి ప్రతిపక్షాలు విమర్శించే వార్తలను దమ్ముంటే ప్రసారం చెయ్యాలని కమల్ హాసన్ చాలెంజ్ చేశారు.
తిత్తుకుడి జిల్లాలో స్టెరిలైట్ కాఫర్ ప్లాంట్ నుంచి కలుషిత నీరు విడుదలై ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారని, పంటలు నాశనం అవుతున్నాయని వేలాది మంది ఉద్యమం చేస్తుంటే అరసు కేబుల్ టీవీ చానల్స్ లో ఎందుకు ప్రసారం చెయ్యడం లేదని తమిళనాడు ప్రభుత్వాన్ని కమల్ హాసన్ నిలదీశారు
ఏప్రిల్ 3వ తేదీన చెన్నై నుంచి కమల్ హాసన్ రైలు యాత్ర చేస్తున్నారు. ఏప్రిల్ 4వ తేదిన తిరుచ్చిలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ బహిరంగ సభ సమావేశంలో కమల్ హాసన్ ప్రసంగించనున్నారు. ఏప్రిల్ 4వ తేదీ తిరుచ్చిలో తమిళనాడు ప్రభుత్వ తీరును ఎండగడుతానని హీరో కమల్ హాసన్ హెచ్చరించారు.

Free Traffic Exchange